ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పద్మా సంఘీభావం
MDK: మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పట్టణంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం ప్రకటించారు. కార్మికుల హక్కులను కాలరాయడం అన్యాయమని, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహిస్తున్న సమ్మె శిబిరాన్ని పోలీసులు తొలగించడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం మొండివైఖరి వీడి, వెంటనే కార్మికులతో చర్చలు జరిపి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు..