ముఖ గుర్తింపు ద్వారా పెన్షన్ పొందవచ్చు: కలెక్టర్

BHPL: ఐడీవోసీ కార్యాలయంలో సోమవారం కలెక్టర్ రాహుల్ శర్మ పోస్టుమాస్టర్లకు ముఖ గుర్తింపు పరికరాలను అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పెన్షన్ గ్రహీతలు ఇకపై బయోమెట్రిక్ సమస్యలు లేకుండా ముఖ గుర్తింపు ద్వారా సులభంగా పెన్షన్ పొందవచ్చని తెలిపారు. ఈ కొత్త సాంకేతికత వృద్ధులు, దివ్యాంగులకు ఎంతో ఉపయోగకరమని ఆయన అన్నారు.