ఆర్టీసీ బస్సులో మహిళ మృతి

ఆర్టీసీ బస్సులో మహిళ మృతి

ELR: కొవ్వూరు ఆర్టీసీ డిపోనకు చెందిన బస్సులో మహిళ మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. రాజమండ్రి నుంచి జంగారెడ్డిగూడెం వైపు వస్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ముప్పిడి జ్యోతి (50) అనే మహిళ కొయ్యలగూడెం మండలం నరసన్నపాలెం దగ్గరకు వచ్చేసరికి బస్సులో ఒక్కసారిగా కుప్పకూలిపోయి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.