నేడు మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణస్వీకారం

HYD: మహేశ్వరం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం సోమవారం ఉదయం 8గంటలకు ఎంపీడీవో సమావేశ మందిరంలో ప్రమాణస్వీకారం జరగనుందని కేఎస్ఆర్ కార్యాలయం నుండి ఒక ప్రకటన వెలువడింది. ఈ కార్యక్రమానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, నియోజకవర్గ కాంగ్రెస్ బాధ్యుడు కేఎస్ఆర్ హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని గమనించాలన్నారు.