అంపైర్లతో వాగ్వాదం.. నెహ్రాకు జరిమానా

గుజరాత్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రాకు భారీ షాక్ తగిలింది. అంపైర్లతో వాగ్వాదానికి దిగినందుకు అతడికి జరిమానా విధించారు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఆట నిలిపివేసిన సమయంలో నెహ్రా అసహనానికి గురై అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. దీంతో అతడి మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కూడా ఇచ్చారు.