గుర్రంపోడులో భారీగా పంట నష్టం
NLR: మొంథా తుఫాను కారణంగా గుర్రంపోడు మండలంలో 40 ఎకరాల పంట నష్టం జరిగినట్లు మండల వ్యవసాయాధికారి కంచర్ల మాధవరెడ్డి తెలిపారు. ఈ మేరకు అధికారులకు నివేదిక పంపినట్లు పేర్కొన్నారు. తానేదారుపల్లిలోని హరిజన కాలనీ కుంట అలుగు కింద నీట మునిగిన నర్సిరెడ్డి వరి పంటను ఆయన పరిశీలించారు. పది ఎకరాలు పూర్తిగా నీట మునగగా, 30 ఎకరాలు నేలకొరిగి దెబ్బతిన్నట్లు చెప్పారు.