VIDEO: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం

W.G: తణుకులో ఆదివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరిక నేపథ్యంలో ఆదివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టే పరిస్థితి లేకుండా పోయింది.