మల్కాపూర్ వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
VKB: చౌడాపూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం వివిధ పార్టీల నాయకులు ప్రారంభించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రంలో అవకతవకలు లేకుండా పార్టీలకు అతీతంగా రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు. సన్నరకం వడ్లకు రైతులు బోనస్ ఉపయోగించుకోవాలని తెలిపారు.