ఆలయాల తొలగింపునకు ముహూర్తం ఖరారు

ఆలయాల తొలగింపునకు ముహూర్తం ఖరారు

BDK: భద్రాచలం రామాలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలోని అనుబంధ ఆలయాల తొలగింపునకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 25న అంకురార్పణ, 26న విగ్రహాల వెలికితీత పనులు ప్రారంభం కానున్నాయి. చినజీయర్‌ స్వామి పర్యవేక్షణలో సుమారు 70కి పైగా విగ్రహాలను సురక్షితంగా తొలగించి, అభివృద్ధి పనులు పూర్తయ్యే వరకు రంగనాయకుల గుట్టపై భద్రపరుస్తామని అధికారులు తెలిపారు.