'పెంచిన గ్యాస్ ధరను తగ్గించాలి'

'పెంచిన గ్యాస్ ధరను తగ్గించాలి'

NLR: కేంద్ర ప్రభుత్వం వంటగ్యాసు, కమర్షియల్ గ్యాస్‌లపై పెంచిన ధరలను వెంటనే తగ్గించాలంటూ సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జొన్నలగడ్డ వెంకమ రాజు డిమాండ్ చేశారు. బుచ్చిరెడ్డిపాలెం పట్టణం సీపీఎం కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు పెంచిన గ్యాస్ ధరలపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లుకు వినతి పత్రం అందజేశారు.