పురుగుల మందు తాగి ఆత్మహత్య

పురుగుల మందు తాగి ఆత్మహత్య

MLG: తాడ్వాయి మండలంలో పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దామెరవాయి గ్రామానికి చెందిన అన్నాల నర్సయ్య అనే వృద్ధుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. గమనించిన కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.