వేములవాడ సీతారాముల కల్యాణానికి తరలివచ్చిన భక్తులు
SRCL: వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో రేపు జరిగే సీతారామచంద్రస్వామి కళ్యాణ కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. పార్కింగ్ స్థలంలో భారీ కల్యాణ వేదికను ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తుండడంతో గదులు సరిపోక పార్కింగ్ స్థలంలోనే బస చేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 24 గంటల పాటు ఆలయాన్ని తెరిచి ఉంచానున్నట్లు తెలిపారు.