మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ఛైర్మన్

మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ఛైర్మన్

VZM: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఉమ్మడి జిల్లా ప్రజలందరినీ ఆ పరమేశ్వరుడు చల్లగా చూడాలని జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలోని శివాలయాలకు పోటెత్తే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు ఉండాలని, ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకోవాలన్నారు.