VIDEO: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ

వరంగల్: జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వస్తున్న మరో లారీ ఢీకొట్టింది. దీంతో లారీ క్యాబిన్‌లో డ్రైవర్ ఇరుక్కుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.