త్రివిధ దళాలకు సహకారం అందించాలని కలెక్టర్ పిలుపు

త్రివిధ దళాలకు సహకారం అందించాలని కలెక్టర్ పిలుపు

NLG: దేశ రక్షణలో తమ ప్రాణాలను పణంగా పెట్టి అహర్నిశలు సేవలు అందిస్తున్న త్రివిధ దళాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. ఈ నెల 7న జరగనున్న సాయుధ దళాల పతాక దినోత్సవంను పురస్కరించుకుని, జిల్లా సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె సైనికులకు బాసటగా డొనేషన్ అందించారు.