VIDEO: గోడపత్రికను ఆవిష్కరించిన కలెక్టర్
W.G: ఇంటింటా సర్వేలో భాగంగా కుష్టు వ్యాధి లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్తించి, సకాలంలో చికిత్సను అందించడం ద్వారా వ్యాధిని సమూలంగా నిర్మూలించాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. నవంబర్ 17వ తేదీ నుండి 30 వరకు జిల్లాలో కుష్టువ్యాధి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ మేరకు వ్యాధి నిర్మూలన ప్రచార గోడ పత్రిక, కరపత్రాలను కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు.