VIDEO: హామీ నిలబెట్టుకున్న ఎమ్మెల్యే

NLR: కావలి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో దాదాపుగా పది సంవత్సరాలుగా రోడ్డు లేక కాలనీవాసులు కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఈ కాలనీకి సిమెంటు రోడ్డు వేస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఆదివారం ఈ కాలనీకి సిమెంటు రోడ్డు వేస్తున్నారు. దీంతో కాలనీ ప్రజలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.