పోలిపాడ్యమి సందర్భంగా దీపాల వేడుక
VSP: పోలిపాడ్యమి సందర్భంగా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం దిగువనున్న వరాహ పుష్కరిణిలో భక్తులు దీపాల వేడుక శుక్రవారం నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భారీగా చేరుకున్న భక్తులు దీపాలు, మొక్కుబడులు సమర్పించారు. భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థానం బారికేడింగ్, ఈతగాళ్ల గార్డులు, పోలీసులు పటిష్ట బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ నిర్వహించారు.