నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
అన్నమయ్య: రాజంపేట మండలంలోని 33/KV మన్నూరు ప్లీడర్ నందు గురువారం మరమ్మతులు చేపడుతున్న కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని నార్త్ ఏఈ వి. శ్రీనివాసరావు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణంలోని ఎర్రబల్లె, మన్నూరు, సాయి నగర్, రాజునగర్ మన్నూరు బైపాసుతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి 10 వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు.