సైబర్ నేరాలపై సీఐ అవగాహన

ప్రకాశం: రాచర్ల మండలం రామాపురం దళిత కాలనీలో రూరల్ సీఐ రామకోటయ్య ఆధ్వర్యంలో సోమవారం అవగాహన కల్పించారు. యువత ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్‌కు దూరంగా ఉండాలని సూచించారు. నేరగాళ్లు ఫోన్లు చేసి వ్యక్తిగత సమాచారం, ఓటీపీ అడుగుతారన్నారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సీఐ సూచించారు.