'కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోండి'

KRNL: మంత్రాలయం నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాలలో కొత్త రేషన్ కార్డులు కోసం గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని మంత్రాలయం టీడీపీ ఇంఛార్జ్ రాఘవేంద్రరెడ్డి బుధవారం తెలిపారు. నూతన రేషన్ కార్డుల జారీ, కార్డుల విభజన, చిరునామా మార్పు, సభ్యులను చేర్చడం, ఉన్నవారిని తొలగించడం, కార్డులను సరెండర్ చేయడం వంటి వాటికి గ్రామ సచివాలయాలను సంప్రదించాలని కోరారు.