'పని ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించాలి'

VZM: పంచాయతీ కార్యదర్శులకు పని ఒత్తిడి నుంచి ప్రభుత్వం ఉపశమనం కలిగించాలని గజపతినగరం మండల పంచాయతీ కార్యదర్శుల అధ్యక్షులు మంత్రి రమణ కోరారు. గురువారం సాయంత్రం పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీవో కళ్యాణికి అందజేశారు. పంచాయతీ పరంగా ఇప్పటికే అందిస్తున్న ప్రాథమిక విధులతో పాటు సర్వేలతో సతమతం అవుతున్నారని చెప్పారు.