మరుగుదొడ్ల సమస్యకు పరిష్కారం

మరుగుదొడ్ల సమస్యకు పరిష్కారం

ASR: చింతపల్లి పాత బస్టాండ్‌ వద్ద ప్రజా మరుగుదొడ్ల సమస్యకు పరిష్కారం లభించింది. నీటి సరఫరా లేక, నిర్వహణ లోపంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిని స్థానికులు ఎంపీడీవో సీతామహాలక్ష్మి దృష్టికి తీసుకువెళ్లారు. ఆమె ప్రత్యేక చొరవతో మరమ్మతులు చేపట్టించారు. పాడైన మోటార్ స్థానంలో కొత్తదాన్ని అమర్చడంతో పాటు, విద్యుత్‌ సరఫరా కోసం ప్యానెల్‌ బోర్డు ఏర్పాటు చేశారు.