'ఉజ్వల భవిష్యత్ కోసమే కిశోర వికాసం'

KDP: యుక్త వయసులో ఉన్న బాలికలు, మహిళల ఉజ్వల భవిష్యత్తుకు కిశోర వికాసం దోహదపడుతుందని హెల్త్ ఎడ్యుకేటర్ లక్ష్మీదేవి, ANM రెడ్డమ్మ అన్నారు. శుక్రవారం చెన్నూరు సచివాలయం- 2 పరిధిలో కిశోర బాలిక వికాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. బాలికలు పోషకాహారాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని తెలిపారు.