టీడీపీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవం వేడుకలు

SKLM: జిల్లాలోని టీడీపీ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు కలమట వెంకట రమణ జాతీయ జెండా ఎగురవేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. . ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వందే అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.