ఇళ్ల కేటాయింపులో అక్రమాలపై మంత్రికి లేఖ రాసిన ఎమ్మెల్యే

ఇళ్ల కేటాయింపులో అక్రమాలపై మంత్రికి లేఖ రాసిన ఎమ్మెల్యే

ASF: సిర్పూర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అక్రమాలు జరుగుతున్నాయని MLA పాల్వాయి హరీశ్ బాబు ఆరోపించారు. జరిగిన అక్రమాలపై శుక్రవారం జిల్లా ఇంఛార్జ్ మంత్రి సీతక్కకు MLA బహిరంగ లేఖ రాశారు. ఇళ్ల కేటాయింపుపై విచారణ జరపాలని, అర్హులైన వారికి ఇళ్లు వచ్చే విధంగా చూడాలని ఆ లేఖలో పేర్కొన్నారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.