అమెరికాలో ఆదాయపు పన్ను రద్దు!
అమెరికా పౌరులకు ఆదాయపు పన్ను నుంచి విముక్తి కల్పించాలనే ఆలోచనలో అధ్యక్షుడు ట్రంప్ ఉన్నట్లు తెలుస్తోంది. తదుపరి అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే.. అమెరికాలో ఆదాయపు పన్నును రద్దు చేసే దిశగా చర్యలు తీసుకుంటానని సంకేతాలు ఇచ్చారు. ఈ నిర్ణయంతో అమెరికన్ పన్ను విధానంలో పెద్ద మార్పులు తీసుకురావాలని ట్రంప్ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.