VIDEO: 'గోవుల రక్షణకు గోశాల ఏర్పాటు అభినందనీయం'

VIDEO: 'గోవుల రక్షణకు గోశాల ఏర్పాటు అభినందనీయం'

MNCL: గోవులను రక్షించేందుకు గోశాల ఏర్పాటు చేయడం అభినందనీయమని మందమర్రి CI శశిధర్ రెడ్డి అన్నారు. రామకృష్ణాపూర్‌లో నాచురల్ అనిమల్ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న గోశాల ప్రారంభోత్సవానికి హాజరై మాట్లాడారు. గాయపడ్డ పశువులకు ట్రస్ట్ సభ్యులు చికిత్స అందించి రక్షించడం అభినందనీయమన్నారు. గోమాత హిందూ సంస్కృతి, ఆధ్యాత్మికతలలో చాలా ముఖ్యమైనది అన్నారు.