ప్రతి సమస్యకు పక్కా పరిష్కారం: కలెక్టర్
HYD: జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు, విద్యార్థులు, కాలనీలలో ఉన్న సమస్యలను ప్రతి సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో జరిగే ప్రజావాణి కార్యక్రమానికి తీసుకువస్తే తప్పనిసరిగా పరిష్కారం చూపుతామని కలెక్టర్ దాసరి హరిచందన తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలందరికీ చేరవేయాలని, ప్రస్తుతం ఈ ప్రక్రియ మరింత వేగవంతంగా జరుగుతున్నట్లు ఆమె తెలిపారు.