రేణు అగర్వాల్ హత్యకేసు UPDATE

TG: కూకట్‌పల్లిలో రేణు అగర్వాల్ అనే మహిళ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి బాలానగర్ డీసీపీ సురేశ్ కుమార్ వివరాలు వెల్లడించారు. 'రేణు అగర్వాల్ హత్యకేసు నిందితుల కోసం గాలిస్తున్నాం. ఇంట్లో పనిచేసే హర్ష(20) అనే యువకుడిపై అనుమానముంది. గతంలో ఏమైనా నేరారోపణలు ఉన్నాయా అనే విషయాలపై ఆరా తీసున్నాం' అని పేర్కొన్నారు.