పాడి రైతులకు అవగాహన
CTR: చిత్తూరు రూరల్ మండలం పరిధిలోని ఆనగల్లులో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. పశు పోషణ ఆరోగ్య పరిరక్షణపై పాడి రైతులకు అవగాహన కల్పించారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ ఝాన్సీ వెంకటేష్ యాదవ్, గురజాల చెన్నకేశవులు పాల్గొన్నారు.