VIDEO: బురదమయం.. రహదారిపై రాకపోకలు కొనసాగించేదెలా..?

VSP: అరకులోయ మండలంలోని బస్కి సమీపంలోని రహదారి బురదమయం కావడంతో ఈ మార్గంలో రాకపోకలకు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల రోడ్డు నిర్మాణం కొరకు రోడ్డుపై మట్టిని త్రవ్వి విడిచిపెట్టేయడంతో తుపాన్‌తో కురిసిన వర్షానికి రహదారి బురదమయంగా తయారవడంతో వాహనచోదకులు గిరిజనులు రాకపోకలకు అడుగు తీసి అడుగు వేయ్యలేని పరిస్థితి నెలకొందని అధికారులు స్పందించాలన్నారు.