'యువత రాజకీయాల్లోకి రావాలి'

'యువత రాజకీయాల్లోకి రావాలి'

WGL: యువత రాజకీయాల్లోకి రావాలని బీజేపీ జిల్లా కార్యదర్శి డా. రాణా ప్రతాప్ రెడ్డి అన్నారు. చెన్నారావుపేట (M) కోనాపురం చెందిన యువకులు ఇవాళ రాణా ప్రతాప్ రెడ్డి సమక్షంలో BJPలోకి చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాల్సిందిగా యువతకు పిలుపునిచ్చారు. బీజేపీ పార్టీ యువతకు రాజకీయాలో మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు.