ప్రజలకు త్వరలో స్వచ్ఛమైన తాగునీరు

ప్రజలకు త్వరలో స్వచ్ఛమైన తాగునీరు

కృష్ణా: పెడన నియోజకవర్గ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడానికి టీడీపీ సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో వెనక్కి వెళ్లిన రూ. 102.8 కోట్ల నిధులను పెంచి తిరిగి తీసుకొచ్చామని పేర్కొన్నారు.  ఈ నిధులతో కాంప్రహెన్సివ్ వాటర్ స్కీమ్ ద్వారా ప్రజలకు తాగునీరు అందిస్తామని ఆయన అన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ద్యేయమని ఆయన అన్నారు.