పెళ్లి రోజు.. హిట్‌మ్యాన్ స్పెషల్ పోస్ట్

పెళ్లి రోజు.. హిట్‌మ్యాన్ స్పెషల్ పోస్ట్

రోహిత్ శర్మ-రితికా సజ్దేహ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టి ఈ రోజుతో పదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా హిట్‌మ్యాన్ ఇన్‌స్టా వేదికగా ఓ స్పెషల్ పోస్ట్ పెట్టాడు. ‘మున్ముందు ఎలా ఉంటుందో తెలియకుండానే పరస్పరం ఓ ప్రమాణం చేసుకున్నాం. కానీ ఈ దశాబ్దం తర్వాత ఇది నా జీవితంలో గొప్ప అధ్యాయం అని చెప్పగలను. డికేడ్ గడిచింది, ఎప్పటికీ లవ్ యూ’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు.