కేంద్ర పథకాలను ప్రజలకు వివరించాలి: ఎమ్మెల్యే
KMR: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ మండల పార్టీ అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని కోరారు.