ఇక్కడే ఉందామా.. ఎక్కడికైనా వెళ్దామా..!
HYD: గత వారం రోజులుగా నగరంలో ఎండలు మండిపోతున్నాయి. నాంపల్లి పబ్లిక్ గార్డెన్లోని కొలనులో నీరు రోజురోజుకు అడుగంటిపోతోంది. కేవలం బురద, నాచు మాత్రమే మిగిలాయి. ఈ క్రమంలో కొలనులో ఉన్న కొన్ని తాబేళ్లు.. వాటి పిల్లలు బయటకు వచ్చి బిక్కు బిక్కుమంటూ పరిసరాలను గమనిస్తూ.. ఇక్కడే ఉందామా.. ఎక్కడికైనా వెళ్దామా అని ఆలోచిస్తూ లోపలికి వెళ్తున్న దృష్యం ఎండ తీవ్రతకు నిదర్శనం.