పోలేరమ్మ సేవలో ఎస్పీ వకుల్ జిందాల్
GNTR: జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ నిన్న కొండపాటూరు శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తిరునాళ్ల సందర్భంగా డ్రోన్ కెమెరాలతో పటిష్ట నిఘా ఏర్పాటు చేసి, నిరంతర పర్యవేక్షణ చేసేందుకు చర్యలు చేపట్టమాన్నారు. ప్రజలు స్వేచ్ఛగా అమ్మవారి తిరునాళ్ల మహోత్సవంలో పాల్గొని, సంతోషంగా వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసుల అధికారులు పాల్గొన్నారు.