గండికోట జలాశయం నుంచి నీటి విడుదల నిలిపివేత
కడప: గండికోట జలాశయం నుంచి మైలవరం జలాశయానికి విడుదల చేస్తున్న నీటిని అధికారులు నిలిపివేశారు. ఉన్నతాధికారులు నిర్ణయించిన 2 TMC నీరు ఇప్పటికే మైలవరం జలాశయానికి చేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మైలవరం EE రమేశ్ తెలిపారు. ప్రస్తుతం మైలవరం జలాశయం నుంచి ఉత్తర కాలువకు 300 క్యూసెక్కులు, దక్షిణ కాలువకు 160 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. కాగా జలాశయంలో 3.3 TMC నీరు నిల్వ ఉంది.