విద్యార్థులు ఇష్టంతో చదవాలి: సీఐ
BHNG: చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారం ప్రభుత్వ పాఠశాలలో ఇవాళ బాలల దినోత్సవం సందర్భంగా చౌటుప్పల్ సీఐ మన్మధ కుమార్ మాట్లాడుతూ...విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టంతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. తాను కూడా విద్యార్థి దశ నుంచి కష్టపడి ఈ స్థాయికి వచ్చానని తెలిపారు. ప్రతి ఒక్కరూ విద్యలో ముందంజలో ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.