ఉచిత టాలెంట్ టెస్ట్ అభినందనీయం

ఉచిత టాలెంట్ టెస్ట్ అభినందనీయం

SRD: పేద విద్యార్థులకు ఉచిత చదువు కోసం టాలెంట్ టెస్ట్ నిర్వహించడం అభినందనీయమని సంగారెడ్డి మండల విద్యాధికారి విద్యాసాగర్ అన్నారు. పీపుల్స్ ప్రోగ్రెస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 5, 6, 7 తరగతి పిల్లలకు ఉచిత చదువు కోసం సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టాలెంట్ టెస్టు సోమవారం ప్రారంభించారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.