ఆర్డీటీ సమస్యల పరిష్కారానికి ఎంపీ వినతి
ATP: ఆర్డీటీ ఎదుర్కొంటున్న పరిపాలనా అడ్డంకులను తొలగించాలని ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ సోమవారం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును కోరారు. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీ సానా సతీష్ బాబు పాల్గొన్నారు. అనుమతుల జాప్యం వల్ల సంస్థ సేవలు ప్రభావితమవుతున్న విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.