లారీని ఢీకొన్న బస్సు..ఇద్దరు విద్యార్థులకు గాయాలు
ఖమ్మం బైపాస్ రోడ్డులో ఇవాళ ఓ ప్రైవేట్ పాఠశాల బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ఆటో అడ్డు రావడంతో లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. అయితే, కనీస దూరం పాటించకుండా వెనకాల వస్తున్న బస్సు లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. గాయపడిన వారిని మరో బస్సులో పాఠశాలకు తరలించారు.