VIDEO: తుంగతుర్తిలో బీఆర్ఎస్ శ్రేణుల నిరసన.!
SRPT: ఈ నెలాఖరు వరకు ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలంటూ సోమవారం తుంగతుర్తిలోని మెయిన్ రోడ్డుపై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. పొలాలన్నీ చేతికొచ్చే సమయంలో ఎస్సారెస్పీ నీళ్లు రాకపోవడంతో రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సీతయ్య అన్నారు. వెంటనే మంత్రి, ఎమ్మెల్యే, అధికారులు స్పందించి నీటిని విడుదల చేయాలని కోరారు.