PGRSలో 17 అర్జీలు స్వీకరించిన ఎస్పీ
W.G: భీమవరం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRSలో ఎస్పీ నయీం అస్మి బాధితుల నుంచి 17 అర్జీలను స్వీకరించారు. వీటిలో ప్రధానంగా కుటుంబ కలహాలు, సైబర్ నేరాలు, భూ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులు అందాయన్నారు. బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు. ఫిర్యాదులపై తక్షణమే స్పందించి పరిష్కరించాలని ఆయన తెలిపారు.