రైస్ మిల్లర్లకు టీటీడీ సూచనలు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అదనపు కార్యనిర్వహణాధికారి సి. హెచ్. వెంకయ్య చౌదరి అన్న ప్రసాదాల కోసం నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాలని రైస్ మిల్లర్లను కోరారు. పద్మావతి విశ్రాంతి గృహంలో జరిగిన సమావేశంలో, ఏపీ, తెలంగాణ రైస్ మిల్లర్ల అసోసియేషన్ పర్యవేక్షణలో ప్రమాణాలకు అనుగుణంగా బియ్యం సరఫరా చేయాలని సూచించారు. దీని వల్ల టీటీడీకి మరింత రుచికరమైన అన్న ప్రసాదాలు అందుతాయని తెలిపారు.