ALERT: రైల్వే టికెట్ బుకింగ్‌లో కొత్త నిబంధన

టికెట్ రిజర్వేషన్ విధానంలో భారతీయ రైల్వే మరో కీలక మార్పును తీసుకొచ్చింది. అక్టోబర్ 1 నుంచి రైలు టికెట్ బుకింగ్ చేసుకునే సాధారణ ప్రయాణికులు కూడా తప్పనిసరిగా ఆధార్ కార్డును జతచేయాలి. తత్కాల్, ఇతర స్పెషల్ కోటాల్లో ఇప్పటికే ఆధార్ తప్పనిసరి అయినప్పటికీ, ఇకపై సాధారణ రిజర్వేషన్‌కూ ఇది వర్తిస్తుంది. కాగా, ఈ నిర్ణయం ప్రయాణంలో పారదర్శకతను పెంచుతుందని రైల్వే అధికారులు తెలిపారు.