గుంటూరు కెనాల్ కాలుష్యం.. కాలనీ వాసుల ఆవేదన

గుంటూరు కెనాల్ కాలుష్యం.. కాలనీ వాసుల ఆవేదన

గుంటూరు రూరల్, బుడంపాడు గ్రామంలోని యానాది కాలనీ వద్ద మంచినీటి కెనాల్‌లో మాంసం వ్యర్థాలు వేయడం వల్ల నీరు కలుషితమవుతోంది. దీంతో సుమారు 90 కుటుంబాలైన 250 మంది గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు లేకపోవడంతో వెంటనే పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వాపోతున్నారు.