ప్రాణాలకు ‘భద్రత’.. ప్రయాణంలో జాగ్రత్త: డీఎస్పీ
SRPT: సురక్షిత ప్రయాణం-అందరి బాధ్యత అని డీఎస్పీ ప్రసన్నకుమార్ అన్నారు. ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు ఈరోజు సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో ‘అరైవ్-అలైవ్’ సదస్సు నిర్వహించారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాంతకమని హెచ్చరించారు. నిబంధనలు పాటిస్తామని ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని, హెల్మెట్ విధిగా ధరించాలని సూచించారు.