ఇసుక ట్రాక్టర్ కిందపడి వ్యక్తి మృతి
నెల్లూరు రూరల్ మండలం పొట్టపాలెం గ్రామంలోని ఇసుక రీచ్‌లో కూలి పనులు చేస్తున్న దయాకర్(27) ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.